logo

పటిష్ఠ బందోబస్తు.. నిరంతర నిఘా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 4న భీమవరంలో పర్యటించనున్న ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తుతో పాటు నిరంతరం నిఘా కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీజీ) ఏఐజీ హిమాన్షుగుప్తా, కేంద్ర సాంస్కృతిక, ప

Published : 29 Jun 2022 04:27 IST

ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 4న భీమవరంలో పర్యటించనున్న ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తుతో పాటు నిరంతరం నిఘా కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీజీ) ఏఐజీ హిమాన్షుగుప్తా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ సంచాలకుడు  అతుల్‌మిశ్రా తదితర అధికారుల బృందం ప్రధాని పర్యటించే ప్రాంతాలను మంగళవారం పరిశీలించింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎస్‌ఓపీ ప్రకారం ఏర్పాట్లు ఉండాలని వారు స్థానిక అధికారులకు సూచించారు. పశ్చిమ కలెక్టర్‌ పి.ప్రశాంతి, డీఐజీ పాలరాజు, సెక్యూరిటీ ఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీలు యు.రవిప్రకాష్‌, రాహుల్‌దేవ్‌శర్మ, రవీంద్రబాబు, సుధీర్‌కుమార్‌రెడ్డి, జాషువా, సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి, సబ్‌కలెక్టర్‌ విష్ణుచరణ్‌, ఆర్డీవో దాసి రాజు తదితరులు వారి వెంట ఉన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని