logo

తెర వెనుక పైరవీలు

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తుది ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి బదిలీ ఉత్తర్వులను సిద్ధం చేశారు. నియోజకవర్గం దాటి వెళ్లేందుకు ఇష్టపడని కొందరు పైరవీలు మొదలుపెట్టారు. పలు శాఖల్లో ఉద్యోగులు

Published : 30 Jun 2022 04:53 IST

నేటితో ముగియనున్న బదిలీల ప్రక్రియ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తుది ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి బదిలీ ఉత్తర్వులను సిద్ధం చేశారు. నియోజకవర్గం దాటి వెళ్లేందుకు ఇష్టపడని కొందరు పైరవీలు మొదలుపెట్టారు. పలు శాఖల్లో ఉద్యోగులు కొందరు బదిలీల నిలుపుదలకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో పాటు నేరుగా సంబంధిత ఉన్నతాధికారులను కలిసి సిఫార్సు లేఖలు ఇచ్చారు. మరికొందరు నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు శ్రమిస్తున్నారు. బదిలీలకు తొలుత ప్రకటించిన గడువును 14 రోజులు పొడిగించారు.

బిల్లు కలెక్టర్లకు..

పురపాలక సంఘాల్లో బిల్లు కలెక్టర్లు ప్రస్తుతానికి సచివాలయ అడ్మిన్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కూడా బదిలీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరికి గురువారం ఉదయం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

అటు నుంచి ఇటు..

పలు శాఖల్లో ఉద్యోగులు ఒప్పంద పూర్వకంగా బదిలీలు చేసుకున్నారు. గతంలో పనిచేసిన చోటకే మళ్లీ వెళ్లేవారు ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఇదే తీరులో దూర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడక్కడే కాలం వెళ్లదీసేవారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని