logo

అనారోగ్యంతో మనస్తాపానికి గురై..

ఏలూరు పంపుల చెరువులో పడి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వన్‌టౌన్‌ రాజీవ్‌ గృహకల్ప ప్రాంతంలో నివాసముంటున్న పైలా అప్పలస్వామి (60) ఏలూరు తితిదే కల్యాణ మండపంలో అటెండర్‌గా

Published : 12 Aug 2022 02:46 IST

పంపుల చెరువులో పడి వృద్ధుడి ఆత్మహత్య

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు పంపుల చెరువులో పడి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వన్‌టౌన్‌ రాజీవ్‌ గృహకల్ప ప్రాంతంలో నివాసముంటున్న పైలా అప్పలస్వామి (60) ఏలూరు తితిదే కల్యాణ మండపంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారులున్నారు. కొంత కాలం నుంచి ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు. వైద్యం పొందుతున్నా తగ్గడం లేదు. ఇటీవల సమస్య ఎక్కువ కావడంతో ఓ వైద్యునికి చూపించగా మందులు ఇచ్చారు. తగ్గకపోతే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం పొందాల్సి ఉంటుందని సూచించారు.  సమస్య తగ్గకపోవడం.. వైద్యం గురించి కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 10న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. గురువారం తెల్లవారుజామున చూసేసరికి అప్పలస్వామి కనిపించ లేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. పంపుల చెరువులో శవమై తేలాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ ఎస్సై ఆది ప్రసాద్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీసి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.   సీఐ ఆది ప్రసాద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని