logo

ఇదండీ రోడ్డు పనుల తీరు!

తల్లాడ-దేవరపల్లి 516డి జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. పనులు జరుగుతుండగానే ఎక్కడికక్కడ అంచులు దిగబడటంతోపాటు ప్రధాన మార్గంపై గోతులు పడుతున్నాయి.

Published : 16 Aug 2022 05:24 IST

నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు


దర్భగూడెం వద్ద రోడ్డు అంచు సరిగా  లేక దిగబడి పడిపోయిన లారీ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: తల్లాడ-దేవరపల్లి 516డి జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. పనులు జరుగుతుండగానే ఎక్కడికక్కడ అంచులు దిగబడటంతోపాటు ప్రధాన మార్గంపై గోతులు పడుతున్నాయి.  ఇప్పటికే  ఇటుగా ప్రయాణం నరక ప్రాయంగా మారింది. కొంత బాగుంటే మరికొంత దారుణంగా ఉంటోంది.  మొత్తం 12 మీటర్ల వెడల్పున ఉంటే అందులో 10 మీటర్ల మేర తారు రోడ్డు. ఇరువైపులా మీటరు చొప్పున అంచులు నిర్మించాలి. కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు సుమారు 23 కిలోమీటర్ల రోడ్డును రూ.62 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ పనుల నాణ్యతపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.


పట్టణంలో కొత్తగా నిర్మించిన బైపాస్‌ రహదారిలో గోతులు

బైపాస్‌ రహదారి.. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్‌లో 3.5 కిలోమీటర్ల మేర రోడ్డును కొత్తగా వేశారు. పారిజాతగిరి రూపక ఆలయం నుంచి విద్యుత్తు ఈఈ కార్యాలయం వరకు ఈ పనులు జరిగాయి. అప్పుడే ఈ రోడ్డుపై కొన్ని చోట్ల గోతులు పడ్డాయి. పైన పోసిన తారు పెలుసులుగా లేచి పోతోంది. పాత రోడ్డులో ఎక్కడైతే ఎక్కువ గోతులు ఉండేవో అక్కడే మళ్లీ పడ్డాయి.   దీనిపై మరో పొర నిర్మాణం ఉంటుందని ఎన్‌హెచ్‌ డీఈ శ్రీనివాసరావు తెలిపారు. దెబ్బతిన్న చోట సరి చేయించి కొత్త పొర వేయిస్తామని చెప్పారు.
అంచులోకి వెళితే అంతే.. మరో విశేషం ఏమిటంటే.. ఈ మార్గంలో అంచుల వెంబడి ఎర్రటి బురద మట్టిని పోస్తున్నారు. ఇది వర్షాల సమయంలో చిక్కగా మారుతోంది. దీంతో అంచులోకి వెళితే చాలు వాహనాలు దిగబడిపోతున్నాయి.  దీనిపై డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ మట్టిని పరిశీలించామని, నాణ్యమైనదేనన్నారు. వాహనాలు దిగబడుతున్న విషయంపై పరిశీలిస్తామని చెప్పారు.


రమణక్కపేట వద్ద దిగబడిన లారీని బయటకు తీసేందుకు డ్రైవర్‌ అవస్థలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని