logo

దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి

దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని జార్జిరెడ్డి సినిమా దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 26 Nov 2022 06:14 IST

ఏలూరులో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల ప్రారంభం

  పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తల ప్రదర్శన

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని జార్జిరెడ్డి సినిమా దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు ఏలూరులో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక ఇండోర్‌ మైదానం నుంచి కేపీడీటీ పాఠశాల వరకు భారీఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. దారి పొడవునా డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ విప్లవ గీతాలను ఆలపించారు. యువకులు మోటారు సైకిళ్లపై విన్యాసాలు చేశారు. అనంతరం కేపీడీటీ పాఠశాలలో నిర్వహించిన సభలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. సమసమాజ నిర్మాణానికి  జార్జిరెడ్డి ప్రాణాలు అర్పిస్తే యువత, విద్యార్థులు ఆయన లక్ష్య సాధనకు కృషి కొనసాగించడం అభినందనీయమన్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలన్నారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమన్నారాయణ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ తదితరులు ప్రసంగించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, నాని,  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని