logo

కర్షకులకు అండగా ప్రభుత్వం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: వివిధ పథకాల అమలుతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్‌ ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి  అన్నారు.

Published : 29 Nov 2022 05:47 IST

నమూనా చెక్కు అందిస్తున్న ముదునూరి, కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: వివిధ పథకాల అమలుతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్‌ ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి  అన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీ రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌, ఇతర అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 2022 ఖరీఫ్‌నకు సంబంధించి 5,331 మంది రైతులకు రూ.4.9 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, 2021 రబీ, ఖరీఫ్‌లలో సున్నావడ్డీ రాయితీగా 64,647 మందికి రూ.12.18 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన నమూనా చెక్కును రైతులకు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్‌ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానశాఖాధికారి దుర్గేష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

లేఅవుట్లలో ఇసుక కేంద్రాలు.. గృహ నిర్మాణాల కోసం జగనన్న లేఅవుట్లలో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆమె సోమవారం దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణాలు, రీసర్వే, టిడ్కో ఇళ్లు తదితర అంశాల గురించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సంచులు సిద్ధం చేసి రైతులకు సకాలంలో అందించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని