logo

‘కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం’

కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా వారికి అన్యాయం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ బోను దుర్గానరేష్‌ అన్నారు.

Published : 05 Feb 2023 03:15 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా వారికి అన్యాయం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ బోను దుర్గానరేష్‌ అన్నారు. ఏలూరులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం కళ్లు తెరిపించేందుకు బీసీల సత్తా చాటేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో చలో దిల్లీ కార్యక్రమం చేపట్టామన్నారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర మహిళ కన్వీనర్‌ భీమవరపు హేమ సుందరి, సంఘ జిల్లా అధ్యక్షుడు భీమవరపు సురేష్‌, నాయకులు నివాస్‌, సాయికిరణ్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని