logo

పరిశోధనలో ముందంజ

మనిషి నిప్పును కనుగొన్న నాటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలు ఎంతగానో మార్పు చెందాయి. విస్తృత స్థాయిలో పరిశోధనలు వాటి ద్వారా పుట్టుకొచ్చే ఆవిష్కరణలే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.

Published : 27 Mar 2024 04:07 IST

జాతీయ స్థాయిలో గుర్తింపు

ఏపీ నిట్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: మనిషి నిప్పును కనుగొన్న నాటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలు ఎంతగానో మార్పు చెందాయి. విస్తృత స్థాయిలో పరిశోధనలు వాటి ద్వారా పుట్టుకొచ్చే ఆవిష్కరణలే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేందుకు శాస్త్రవేత్తలు చేపడుతున్న పలు పరిశోధనలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌కు చెందిన ఆచార్యులు, పరిశోధన విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తున్నారు. వీరు చేపట్టిన ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు తమ పరిశోధనలలో పురోగతి సాధించేందుకు ప్రోత్సాహకాలు సైతం అందుతుండటం విశేషం.  


అయస్కాంత లక్షణాలపై శోధన

ఏపీ నిట్‌లో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్న  మాచవరపు రాముడు స్పింట్రోనిక్స్‌ అనువర్తనాలకు మాంగనీస్‌ ఆధారిత యాంటీఫెరో మ్యాగ్నెట్‌ హ్యూస్లర్‌ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదార్థాల అయస్కాంత లక్షణాలను, స్పింట్రోనిక్స్‌లో సాధ్యమయ్యే అనువర్తనాలు మెరుగుపరిచేందుకు ప్రతి మూలకం పాత్రను క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు రూ.25 లక్షల నిధులు  కేటాయించింది. వీటిని వినియోగించి,  స్పింట్రోనిక్స్‌ అప్లికేషన్‌లకు అనువైన కొత్త హ్యూస్లర్‌ యాంటీఫెరో మాగ్నెటిక్‌ మెటీరియల్‌ రూపొందించాల్సి ఉంది.


పేపర్‌ ప్రజెంటేషన్‌కు నగదు ప్రోత్సాహకం

మెటలర్జికల్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన విద్యార్థి పార్థసారథి పదార్థాల(మెటీరియల్స్‌)పై నిర్వహిస్తున్న పరిశోధనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మెటలర్జికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విద్యార్థి పేపర్‌ ప్రజెంటేషన్‌  మెచ్చి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. మెకానికల్‌ ఎల్లోయింగ్‌ ఆఫ్‌ హై ఎంట్రోపి ఎల్లాయిస్‌పై ఇతను పరిశోధనలు చేస్తున్నారు. 1500 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా  పదార్థాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని