logo

వంద నిమిషాల్లో పరిష్కారం

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్‌ నోడల్‌ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 29 Mar 2024 04:10 IST

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్‌ నోడల్‌ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు యాప్‌ ద్వారా అందిన 77 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అనుమతి లేని పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించడం, డబ్బు, మద్యం పంపిణీ చేయడం తదితర అంశాలను యాప్‌ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని