logo

రైతు బజార్లకు పైసా విదల్చని జగన్‌

జగన్‌ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది.

Published : 20 Apr 2024 06:45 IST

నిర్వహణ గాలికొదిలిన వైకాపా సర్కారు
కొత్త నిర్మాణాలపై తాత్సారం
తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన  మినీ బజార్లకు గ్రహణం
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, మొగల్తూరు

జగన్‌ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. కొత్తవి నిర్మించక పోగా ఉన్నవాటి నిర్వహణ గాలికొదిలేయటంతో కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. చివరకు తెదేపా హయాంలో మొదలు పెట్టి తుది దశకు వచ్చిన నిర్మాణాలను అయిదేళ్లుగా పూర్తి చేయకుండా తాత్సారం చేసింది.

అధికారులు కళ్లు మూసుకున్నారా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లలో నాణ్యత అరకొరగానే ఉంటోంది. ఉల్లి, క్యారెట్‌, టమాట, బంగాళాదుంప, చిక్కుడు, బీట్‌రూటు ఇలా ఏ కూరగాయలైనా నాసిరకంగానే ఉంటున్నాయి. ధరలు తగ్గినా బోర్డుల్లో మాత్రం తగ్గించకుండా మాయ చేస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాద రైతు బజార్లో మార్కెట్‌ ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.


నిధులు ఇస్తే ఒట్టు: ఉమ్మడి జిల్లాలో వైకాపా అధికారం చేపట్టాక రైతు బజార్లకు పైసా నిధులు కూడా ఇవ్వలేదు. తెదేపా నిర్మాణం చేపట్టిన రైతు బజార్లను మొదలు పెట్టేందుకు కూడా వైకాపా సర్కారుకు మనసు రాలేదు. కలిదిండిలో రూ.36 లక్షలతో నిర్మాణం 80 శాతం పూర్తయింది. తెదేపా చేపట్టిందన్న అక్కసుతో గాలికొదిలేశారు.  
చిన్నపాటి వర్షానికే నీట మునిగి పోయే ఏలూరు పత్తేబాద రైతు బజారు ఇది.  మెరక చేసేందుకు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వైకాపా ప్రభుత్వంపై గుత్తేదార్లకు ఉన్న నమ్మకమిది.  


అవస్థలు ఇవి


 

  • నిత్యం వందలాది మంది వచ్చే  ఏలూరులోని పత్తేబాద రైతు బజారుకు కనీస సౌకర్యాలు లేవు. స్థలం ఇరుకు. పార్కింగ్‌ సౌకర్యం లేక రహదారిపై వాహనాలునిలిపేస్తున్నారు.  
  • ఏ రైతు బజారులోనూ డిజిటల్‌ ధరల పట్టికలు వినియోగంలో లేవు. ఆర్వో ప్లాంట్లు పని చేయటం లేదు. మరుగుదొడ్ల ఊసే లేదు.


గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన మొగల్తూరులోని మినీ రైతుబజారుని వైకాపా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకుండా ఇలా వదిలేసింది.


తెదేపా ప్రారంభించిందని అక్కసా..

తెదేపా హయాంలో మండలానికొకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 33 మినీ రైతు బజార్లను నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వ అసమర్థతో వాటిలో ప్రస్తుతం ఎలాంటి విక్రయాలు జరగటం లేదు. తెదేపా ప్రారంభించిన వాటిని వినియోగంలోకి తీసుకురావటం ఎందుకు అని   వీటిని నిరుపయోగంగా మిగిల్చింది.


ఉమ్మడి జిల్లాలోని తణుకు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వంటి కీలక పట్టణాల్లో అసలు రైతు బజార్లే లేవంటే ఇంతకన్నా దైన్యం ఏముంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని