logo

వీల్‌ఛైర్‌ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి

మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్‌ఛైౖర్‌ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 24 Apr 2024 04:03 IST

దివ్యాంగులకు ఎన్నికల సంఘం అవకాశం

కుక్కునూరు, న్యూస్‌టుడే: మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్‌ఛైౖర్‌ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో ఫెసిలిటీస్‌ ఆఫ్‌ పోలింగ్‌ బూత్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ఓపెన్‌చేసి అందులో రిక్వెస్ట్‌ ఫర్‌ వీల్‌ఛైౖర్‌ అనే ఆప్షన్‌ను నొక్కితే మొబైల్‌ నంబరు, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఓటీపీ ద్వారా లాగిన్‌ అయితే అందులో మీ పోలింగు కేంద్రం నంబరు, ఓటరు పేరు, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. వాటిని పూర్తిచేసి పంపితే పోలింగురోజు వీల్‌ఛైర్‌ మీ కోసం బూతు వద్ద అందుబాటులో ఉంచుతారు. ఈ యాప్‌లో ఇంకా ఓటరు రిజిస్ట్రేషన్‌, సమాచారం, ఫిర్యాదులు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పటికే 85 ఏళ్లు పైబడి మంచానికే పరిమితమైన ఓటర్లు, సదరమ్‌ ధ్రువీకరణతో అంగవైకల్యం 40 శాతం ఉన్న దివ్యాంగులకు ఇంటివద్దే ఓటుహక్కు కల్పించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఈ తరహా ఓటర్లు కానివారు, ఎక్కువ దూరం నడవలేని వారు వీల్‌ఛైర్‌ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని