రైలు కింద పడి విద్యార్థిని బలవన్మరణం
మండల పరిధి కొత్తమాధవరం జాంబవంతుని వీధికి చెందిన విద్యార్థిని నల్లా శ్యామల (20) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
శ్యామల (పాత చిత్రం)
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : మండల పరిధి కొత్తమాధవరం జాంబవంతుని వీధికి చెందిన విద్యార్థిని నల్లా శ్యామల (20) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కడప రైల్వే ఎస్.ఐ రారాజు తెలిపిన వివరాల మేరకు... శ్యామల కడపలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బి.కాం కంప్యూటర్స్ తృతీయ సంవత్సరం చదువుతోంది. గత కొన్నాళ్లు నుంచి మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతోంది. మంగళవారం రాత్రి నాన్నమ్మ దగ్గరకు వెళుతున్నట్లు చెప్పి నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కడప రైల్వే పోలీసులు బుధవారం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. శ్యామల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు