logo

ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్‌ కేంద్రం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్‌ (పీఎస్‌-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్‌ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు

Published : 29 Mar 2024 05:22 IST

 ఓటు వేసేందుకు వరుసలో నిల్చున్న బీఎల్వోలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్‌ (పీఎస్‌-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్‌ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు.  ప్రతిఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు వినియోగంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని తహసీల్దారు వెంకటరమణ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్‌ నమోదు శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి ఓటర్లలో చైతన్యం తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో డీటీ శ్రీనివాసులు, ఏఎస్‌వో పద్మజ, పర్యవేక్షకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని