logo

తెదేపాతోనే అన్ని వర్గాలకు న్యాయం

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గద్దె దించాలని  ఎన్‌డీఏ కడప పార్లమెంట్‌ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అన్నారు.

Published : 17 Apr 2024 05:33 IST

మైలవరంలో పార్టీలో చేరిన వారితో కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

మైలవరం, ప్రొద్దుటూరు వైద్యం, రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, బి.కోడూరు, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గద్దె దించాలని  ఎన్‌డీఏ కడప పార్లమెంట్‌ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మైలవరం మండలంలోని దొమ్మర నంద్యాల, తొర్రివేముల, నక్కొనిపల్లె, బుచ్చంపల్లె, సి.కొత్తపల్లె, చిన్నకొమెర్ల గ్రామాల్లో వైకాపా చెందిన 150 కుటుంబాలు తెదేపాలో చేరాయి. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర్లు రిషి అపార్ట్‌మెంట్‌ వద్ద శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలోనే బీసీల అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం శ్రీనివాసనగర్‌లో ప్రచారం చేశారు. రాజుపాళెం మండలంలోని పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దువ్వూరు మండలంలోని వెంకుపల్లె గ్రామంలో సర్పంచు బోదనపు రోజరమణి, నాగభూషణం, నాగరాజు, దస్తగిరి, సుబ్బయ్య, పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, మహేశ్వరరెడ్డి, రమేష్‌రెడ్డి, ఎస్సీ కాలనీకి చెందిన కోటి అంకల్‌, రామలక్షుమయ్య, తదితరులు ఆధ్వర్యంలో వైకాపా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ సమక్షంలో అనేకమంది తెదేపాలో చేరారు. అనంతరం పుట్టా మాట్లాడుతూ వైకాపా ఆరాచక, దౌర్జన్య, సైకో పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తెదేపాలో చేరుతున్నారన్నారు. మైదుకూరు పట్టణంలోని 9వ వార్డులో పుట్టా ప్రచారం చేశారు. అనంతరం బడి పెద్దనరసింహులు, చిన్న నరసింహులు, యారాల ప్రసాద్‌, సాయినరేంద్ర తదితరులు పార్టీలో చేరారు. బి.కోడూరు మండలంలోని సిద్దుగారిపల్లె, పాత ప్రభలవీడు, నరసయ్య కొట్టాలు గ్రామాల్లో బద్వేలు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న ఇంటింటి ప్రచారం చేశారు.

ప్రొద్దుటూరులో మాట్లాడుతున్న వరదరాజులురెడ్డి, పక్కన   బచ్చల పుల్లయ్య, నాగరాజు, రాజగోపాల్‌ యాదవ్‌ తదితరులు

దువ్వూరులో పార్టీలో చేరిన వారికి కండువా వేసి  ఆహ్వానిస్తున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌

బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లెలో ప్రచారం చేస్తున్న బోజ్జా రోశన్న, ఎన్‌డీఏ నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని