logo

Andhra News: సినీఫక్కీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అపహరణ

తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొవిడ్‌ కారణంగా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు

Updated : 05 Feb 2022 11:19 IST


పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు ఈశ్వరరావు

‘మీ ఇంటికి ఫోన్‌ చేసి రూ.50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా పెద్ద సారుకు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.’ ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్‌.కోటలో చోటుచేసుకుంది. 

శృంగవరపుకోట, తెర్లాం, న్యూస్‌టుడే  తెర్లాం మండలం కునాయవలసకు చెందిన తెర్లి ఈశ్వరరావు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొవిడ్‌ కారణంగా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఈయన శుక్రవారం ఉదయపు నడక కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వచ్చారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది, సహకరించాలని కోరగా వెనుక నుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై  కర్రతో దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి  ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్‌.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్‌ ప్లాంటు వద్దకు తీసుకొచ్చారు.   లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు చేరుకుని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారయ్యాడు. పారిపోయిన వ్యక్తి వాటర్‌ ప్లాంటు నిర్వహిస్తున్న ఎస్‌.కోట మండలం రేవళ్లపాలేనికి చెందిన రాజశేఖర్‌గా, పట్టుబడిన వారు ఇతని వద్ద వాహన చోదకులు రేవళ్లపాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్‌.కోటకు చెందిన అంబటి మోహనరావుగా గుర్తించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. 


అపహరణకు వినియోగించిన కారు

డబ్బుల కోసమే...
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్‌ స్నేహితులతో కలసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా వైద్యులు విజయనగరం రిఫర్‌ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన తెర్లాం పోలీసు స్టేషను పరిధిలో జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడే దర్యాప్తు చేయాలా అన్నది నిర్ణయిస్తామని ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని