logo

Crime News: 7న విడుదల.. 8న బైకుల చోరీ!

 రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట పార్కింగ్‌ స్థలాల్లో ఉంచిన ద్విచక్ర వాహనాల హ్యాండిల్‌ తాళాలు పగులకొట్టి.. చోరీ చేయడంలో అతను సిద్ధహస్తుడు. గతంలో నాలుగు వాహనాలు

Published : 15 Mar 2022 09:26 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే:  రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట పార్కింగ్‌ స్థలాల్లో ఉంచిన ద్విచక్ర వాహనాల హ్యాండిల్‌ తాళాలు పగులకొట్టి.. చోరీ చేయడంలో అతను సిద్ధహస్తుడు. గతంలో నాలుగు వాహనాలు చోరీచేసి జైలుకు వెళ్లి ఈనెల 7న బెయిల్‌ మీద బయటికి వచ్చాడు. వచ్చీరాగానే స్నేహితుడితో కలిసి తిరిగి చోరీకి పాల్పడగా.. మలక్‌పేట పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలోని కొత్తకోట చర్చి కాలనీకి చెందిన అడ్డాకుల విక్టరీ బాబు (22) అలియాస్‌ వర్ష.. సరూర్‌నగర్‌లోని శివగంగా థియేటర్‌ సమీపంలోని ప్రగతినగర్‌లో ఉంటున్నాడు.  2016లో సైదాబాద్‌,  చైతన్యపురి ఠాణా పరిధిలో మూడు కేసుల్లో నిందితుడు. గత నెల పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఈనెల 7న బెయిల్‌పై విడుదల అయ్యాడు. 8న  చంపాపేటకు చెందిన మిత్రుడు కంబాలపల్లి రాజు (22)తో కలిసి మలక్‌పేట ఠాణా పరిధిలో రెండు, మారేడ్‌పల్లి, సుల్తాన్‌బజార్‌ ఠాణాల పరిధుల్లో ఒకటి చొప్పున నాలుగు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. మన్సూరాబాద్‌కు చెందిన బాధితుడు వీరేష్‌ ఈనెల 12న మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టగా సోమవారం ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి నాలుగు బైకులు  స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని