logo

గుండెపోటుతో బ్రహ్మానందచారి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కర్షక్‌ ఇండస్ట్రీస్‌ అధినేత పసునూరి బ్రహ్మానందచారి(82) బుధవారం మృతి చెందారు. కాలుకు గాయమై చికిత్స కోసం మూడు రోజుల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన మధ్యాహ్నం

Published : 20 Jan 2022 03:11 IST

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కర్షక్‌ ఇండస్ట్రీస్‌ అధినేత పసునూరి బ్రహ్మానందచారి(82) బుధవారం మృతి చెందారు. కాలుకు గాయమై చికిత్స కోసం మూడు రోజుల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన బ్రహ్మానందచారి స్థానికంగా కర్షక్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 1982లో తెదేపాలో చేరి ఎన్టీఆర్‌కు సన్నిహితులుగా మెలిగారు. తెదేపా నుంచి 1986లో గౌలిపురా కార్పొరేటర్‌గా, 1989లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శాంతి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, పాతనగర ప్రజావేదిక చైర్మన్‌గా, హరిబౌలి అక్కన్నమాదన్న మహంకాళీ దేవాలయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మృతికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆవుల భరత్‌ప్రకాశ్‌, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు రంగాచారి, సుల్తాన్‌షాహీ జగదాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి, పాతనగర ప్రజా వేదిక అధ్యక్షుడు జి.మహేశ్‌గౌడ్‌, లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయ కమిటీ ఛైర్మన్‌ కె.వెంకటేశ్‌, మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, తెరాస నేత ప్రకాశ్‌ ముదిరాజ్‌ సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని