logo

9న రాష్ట్రవ్యాప్త డాక్‌ అదాలత్‌

తపాలా శాఖకు చెందిన ఫిర్యాదులు, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ఫిబ్రవరి 9న రాష్ట్రవ్యాప్త ‘డాక్‌ అదాలత్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 28 Jan 2022 04:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: తపాలా శాఖకు చెందిన ఫిర్యాదులు, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ఫిబ్రవరి 9న రాష్ట్రవ్యాప్త ‘డాక్‌ అదాలత్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్లో నిర్వహించే ఈ అదాలత్‌లో పాల్గొనదలచిన వారు.. ఫిర్యాదులు ఎం.మన్మదరావు, తపాలా సేవలు సహాయ సంచాలకులు, చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం, తెలంగాణ సర్కిల్‌, హైదరాబాద్‌ - 500001 చిరునామాకు ఫిబ్రవరి 2 లోగా చేరేలా పంపాలని కోరింది. కవర్‌పైన డాక్‌ అదాలత్‌ అని స్పష్టంగా రాయాలని, ఫోన్‌ నంబరు, ఇ-మెయిల్‌ ఐడీ పేర్కొనాలంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని