logo

ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీరామనగరం

ప్రపంచ దేశాలను ఆకర్షించేలా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని రూపొందించడం తెలంగాణ ప్రజల అదృష్టమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 29 Jan 2022 03:06 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలను ఆకర్షించేలా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని రూపొందించడం తెలంగాణ ప్రజల అదృష్టమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకు శ్రీరామనగరంలో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల ఏర్పాట్లను టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రఘుమారెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. కుటీరంలో త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సమారోహం వేడుకల ఆహ్వాన పత్రికను చిన జీయర్‌ స్వామి మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీరామనగరంలో క్షణం కూడా విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం, 28 నియంత్రికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, జగత్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని