icon icon icon
icon icon icon

AP High court: గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా

గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

Published : 02 May 2024 19:10 IST

అమరావతి: జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఇతర అభ్యర్థులకు కేటాయించిన సింబల్‌ను మార్చలేమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ను ఇప్పటికే పంపించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img