icon icon icon
icon icon icon

వృద్ధురాలని కనికరం లేకుండా చీర లాగారు

జగన్‌ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే మనం పాకిస్థాన్‌లో ఉన్నామా..? అనే అనుమానం కలుగుతోందని, చివరికి సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు ఘోరంగా మారాయని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 21 Apr 2024 05:50 IST

తెదేపా సానుభూతిపరులపై వైకాపా నేతల దాడి అమానుషం
భర్త తరఫున ఆదిమూలపు సతీమణి నామినేషన్‌ వేయడం కోడ్‌ ఉల్లంఘనే
వేర్వేరు ఘటనలపై సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే మనం పాకిస్థాన్‌లో ఉన్నామా..? అనే అనుమానం కలుగుతోందని, చివరికి సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు ఘోరంగా మారాయని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో తెదేపా సానుభూతిపరులైన వృద్ధ దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషమని పేర్కొన్నారు. వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా ఆమె చీర లాగడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసులు బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టడం దారుణమని దుయ్యబట్టారు. దీంతోపాటు పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతిని రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల అధికారి హరీంధిరప్రసాద్‌కు తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ, వల్లూరి కిరణ్‌లు శనివారం అందజేశారు. ‘సీఎం జగన్‌ వైయస్‌ఆర్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీనే లేకుండా చేయాలని చూస్తున్నారు. కొండపి వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ సతీమణి విజయలక్ష్మి కర్ణాటకలో ఆదాయ పన్నుల విభాగంలో అధికారిణిగా పని చేస్తున్నారు. తన భర్త తరఫున ఆమె నామినేషన్‌ దాఖలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. తక్షణం ఆమెను సస్పెండ్‌ చేయాలని కోరాం. ఈ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే విజయవాడ సెంట్రల్‌ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌.. తెదేపా వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. గులకరాయి కేసులో అమాయకుల్ని అదుపులోకి తీసుకొని, వారి ఆచూకీ చెప్పకుండా పోలీసులు డ్రామాలు ఆడుతున్నారు’ అని వర్ల రామయ్య మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img