icon icon icon
icon icon icon

‘సిద్ధం’ సభలకు రావాలంటూ డ్వాక్రా మహిళల్ని బెదిరిస్తున్నారు

వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు రావాలంటూ డ్వాక్రా మహిళల్ని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు.

Published : 21 Apr 2024 06:14 IST

సీఈఓకి ఆచంట సునీత ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు రావాలంటూ డ్వాక్రా మహిళల్ని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. సభలకు హాజరుకాకపోతే రుణాలు ఇవ్వబోమని, సంక్షేమ పథకాల్ని నిలిపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఫిర్యాదు ప్రతిని రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల అధికారి హరీంధిరప్రసాద్‌కు.. తెదేపా మహిళా నేతలు పాలడుగు వినీల, బొప్పన నీరజ తదితరులతో కలిసి శనివారం ఆమె అందజేశారు. అనంతరం సునీత విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా డ్వాక్రా మహిళల్ని వైకాపా వాళ్లు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సభా ప్రాంగణాలకు గ్రూపుల పేర్లు, సభ్యుల వివరాలు ఉన్న రిజిస్టర్లు తెచ్చి హాజరు తీసుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img