icon icon icon
icon icon icon

డీజీపీపై చర్యలు తీసుకోండి

సీఎం జగన్‌పై స్వామిభక్తి ప్రదర్శిస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 23 Apr 2024 06:42 IST

సీఈవోకు తెదేపా ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై స్వామిభక్తి ప్రదర్శిస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. సీనియర్లు ఉన్నా.. సీఎం మాత్రం ఆయననే డీజీపీగా నియమించడంతో వైకాపాకు రాజేంద్రనాథరెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. దీంతోపాటు పలు అంశాల్ని తెదేపా నేతలు వర్ల రామయ్య, పోసాని వెంకటేశ్వర్లు తదితరులు సీఈవోకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు సీఎం బస్సు డోర్‌ దగ్గర ఉండాలంటూ సర్క్యులర్‌ జారీచేయడం సిగ్గుచేటు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. కడప జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై ఈసీ ప్రత్యేక దృష్టిపెట్టాలి. కుప్పం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ సతీమణి వాహనాన్ని ఆర్వో కార్యాలయంలోకి నేరుగా అనుమతించడం ఈసీ నిబంధనల ఉల్లంఘనే. పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న ఆర్వోపై చర్యలు తీసుకోండి. పల్నాడులో తెదేపా నేత జంగా కృష్ణామూర్తికి మద్దతు తెలిపాడనే కారణంతో శ్రీనివాస్‌యాదవ్‌ అనే వ్యక్తి ట్రాక్టరును వైకాపా కార్యకర్తలు తగలబెట్టారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img