icon icon icon
icon icon icon

అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరారు.

Published : 24 Apr 2024 07:42 IST

లాంఛనంగా పార్టీలో చేరిక

ఈనాడు, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరారు. మంగళవారం విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీచేస్తారని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలతో ఆయన అనుయాయులను సమన్వయం చేసుకొని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తొలుత అనపర్తి భాజపా టికెట్‌ దక్కించుకున్న శివరామకృష్ణంరాజు.. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, సీటు వదులుకొన్నారని పురందేశ్వరి ప్రశంసించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు పాలన, యువతకు పవన్‌కళ్యాణ్‌ ఆలోచనలు అవసరమని పేర్కొన్నారు. అనపర్తి నుంచి కమలం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేస్తానని శివరామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img