icon icon icon
icon icon icon

జగన్‌ పాలనలో విద్యుత్తు బిల్లు పట్టుకుంటేనే షాక్‌

సీఎం జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడంపై లేదని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 25 Apr 2024 06:07 IST

తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడంపై లేదని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన.. రాష్ట్రంలో విద్యుత్తు సహా అన్ని ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. విద్యుత్తు బిల్లు పట్టుకుంటేనే షాక్‌ కొడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘‘వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. ప్రతిపక్ష నేతగా విద్యుత్తు ఛార్జీలు పెంచనన్న జగన్‌... సీఎం అయిన అయిదేళ్లలో పది సార్లు పెంచారు. ప్రజలపై రూ.75 వేల కోట్ల భారాన్ని మోపారు. చివరికి వర్షాకాలంలో కూడా కరెంటు పోయే దుస్థితి తెచ్చారు. అప్రకటిత విద్యుత్తు కోతలతో చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు’’ అని సునీత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img