icon icon icon
icon icon icon

ధర్మానపై 2 ఈడీ.. 3 సీబీఐ కేసులు

రాష్ట్ర రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు సమర్పించిన అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రస్తావించారు.

Published : 25 Apr 2024 06:32 IST

ఆస్తులు రూ.15.64 కోట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు సమర్పించిన అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. దాని ప్రకారం ధర్మానపై 2 ఈడీ, 3 సీబీఐ కేసులతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 3 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి హోదాలో కుమ్మక్కు, నేరపూరిత కుట్ర, మోసం, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అభియోగాలపై ఈ కేసులు నమోదయ్యాయి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కూడా కేసు ఉంది. ఇవి హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

  • ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ కంపెనీకి 400 ఎకరాలకు బదులు 18,878.02 ఎకరాల భూమిని కుట్రపూరితంగా కట్టబెట్టినట్లు ఈడీ విచారణలో తేల్చింది. నీ అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 8,844.01 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇందూ గ్రూప్‌ కంపెనీలకు కేటాయించడంపై ఈడీ కేసు పెట్టింది. దీనిపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది.
  • అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌కు ఆయాచిత లబ్ధి చేకూర్చేలా 231.09 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై కేసు నమోదైంది.

సొంత కారు లేదట

ధర్మాన ప్రసాదరావు దంపతులకు సొంత కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన పేరిట 15.64 కోట్ల స్థిర, చరాస్తులు ఉండగా, రూ.3.06 కోట్ల అప్పు ఉంది. ప్రసాదరావు చేతిలో రూ.18.40 లక్షల నగదుతో పాటు రూ.6.06 కోట్ల చరాస్తి ఉంది. స్థిరాస్తులు రూ.9.58 కోట్లు. భార్య వద్ద నగదు రూ.4.70 లక్షలు ఉండగా, చరాస్తులు రూ.5.87 కోట్లు, స్థిరాస్తులు రూ.3.43 కోట్లు ఉన్నాయి. ఆమెకు రూ.2.85 కోట్ల రుణముంది. హిందూ అవిభాజ్య కుటుంబం కింద రూ.3.46 కోట్ల చరాస్తులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img