icon icon icon
icon icon icon

తెదేపాకు యనమల సోదరుడు కృష్ణుడి రాజీనామా

తెదేపాను వీడి, వైకాపాలో చేరనున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ప్రకటించారు.

Published : 27 Apr 2024 05:46 IST

తుని, న్యూస్‌టుడే: తెదేపాను వీడి, వైకాపాలో చేరనున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ప్రకటించారు. కాకినాడ జిల్లా తునిలో కృష్ణుడు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ తన రాజీనామాను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపుతున్నానని వెల్లడించారు. తాను 42 ఏళ్లు పార్టీకి సేవ చేసినా గుర్తింపు లేక, మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. గతంలో రెండుసార్లు టికెట్‌ ఇచ్చినా, వివిధ కారణాలతో ఓడిపోయానని, ఈసారి ప్రజల్లో మంచి ఊపు ఉండి, తన విజయం సునాయాసం కాగలదని భావించానన్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి, అన్న యనమల రామకృష్ణుడు ఆయన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే మళ్లీ ఆయనే ఎమ్మెల్సీ అవుతారని, ఇన్నేళ్లు కష్టపడ్డ తానేం కావాలని ప్రశ్నించారు. అందుకే తాను వైకాపాలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. పార్టీలో మరో సీనియర్‌ నేత పోల్నాటి శేషగిరిరావు మాట్లాడుతూ తానూ రాజీనామా చేసి కృష్ణుడి వెంటే వెళుతున్నానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img