icon icon icon
icon icon icon

చనిపోయిన వ్యక్తి పేరును స్వార్థానికి వాడుకునే వ్యక్తి జగన్‌

చనిపోయిన వ్యక్తి పేరును స్వార్థానికి వాడుకునేవారు సీఎం జగన్‌ అని పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. మాజీ మంత్రి దివంగత వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి పులివెందుల సభలో జగన్‌ ప్రస్తావించడం దారుణమన్నారు.

Published : 27 Apr 2024 05:51 IST

పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ధ్వజం

ఈనాడు, కడప: చనిపోయిన వ్యక్తి పేరును స్వార్థానికి వాడుకునేవారు సీఎం జగన్‌ అని పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. మాజీ మంత్రి దివంగత వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి పులివెందుల సభలో జగన్‌ ప్రస్తావించడం దారుణమన్నారు. జగన్‌ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కడపలో శుక్రవారం ఆయన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదవాడికి, పెత్తందారుకు మధ్య యుద్ధమని తరచూ జగన్‌ అంటుంటారని.. రాష్ట్రంలోని పెత్తందారులందరికీ జగన్‌ ప్రతినిధి అని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.750 కోట్ల ఆస్తులున్నట్లు జగన్‌ చూపించారని, ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తులు రూ.80 లక్షలలోపేనని వెల్లడించారు. అఫిడవిట్లను చూసయినా పేద ఎవరు? పెత్తందారు ఎవరో తెలుసుకుని జగన్‌ చెప్పినట్లే పేదవాడినైన తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. తన చెల్లెలు షర్మిల చీర రంగుపైనా మాట్లాడుతున్నారంటే జగన్‌ను ఏమనాలని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్‌ ఎలా తోసిపుచ్చుతారని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని జగన్‌ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా వివేకాను ఎంపిక చేసినప్పటికే ఆయన రెండో పెళ్లి వ్యవహారం బయటకొచ్చిందని.. అప్పట్లో లేనిది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. పులివెందుల రావడానికి రెండ్రోజుల ముందు జగన్‌ నుదుటిపై ప్లాస్టర్‌ లేదని.. సానుభూతి కోసం ఇక్కడికొస్తూ పెట్టుకున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img