icon icon icon
icon icon icon

2,705 ‘అసెంబ్లీ’ నామినేషన్ల ఆమోదం

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలన తర్వాత 175 శాసనసభ స్థానాలకు మొత్తం 2,705 నామినేషన్లను ఆమోదించగా.. 939 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Published : 28 Apr 2024 06:41 IST

939 తిరస్కరణ
లోక్‌సభ స్థానాలవి 503 ఆమోదం, 183 తిరస్కరణ
సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలన తర్వాత 175 శాసనసభ స్థానాలకు మొత్తం 2,705 నామినేషన్లను ఆమోదించగా.. 939 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. 25 లోక్‌సభ స్థానాలకు 503 నామినేషన్లను ఆమోదించగా, 183 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు జరిగిన నామినేషన్‌ పత్రాల స్వీకరణలో రాష్ట్రంలోని అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు వరుసగా 3,644, 686 నామినేషన్లు దాఖలయ్యాయని శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘అసెంబ్లీ స్థానాల్లో.. అత్యధికంగా తిరుపతికి 52, అత్యల్పంగా చోడవరాని(ఎస్సీ)కి 8 నామినేషన్లు వచ్చాయి. అలాగే.. అత్యధికంగా తిరుపతి 48, అత్యల్పంగా చోడవరంలో 6 నామినేషన్లు ఆమోదం పొందాయి. లోక్‌సభ స్థానాల్లో.. అత్యధికంగా గుంటూరుకు 47, అత్యల్పంగా శ్రీకాకుళానికి 16 నామినేషన్లు వేశారు. ఇందులో అత్యధికంగా నంద్యాల 36, అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు పోటీలో ఉంటారు. ’ అని మీనా వెల్లడించారు. తెనాలి కాంగ్రెస్‌ అభ్యర్థి చందు సాంబశివుడిది ఆమోదం పొందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img