icon icon icon
icon icon icon

2018 గ్రూప్‌-1 అధికారుల్ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి

2018 గ్రూప్‌-1లో ఎంపికైన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాను తెదేపా నేతలు మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ తదితరులు కోరారు.

Published : 29 Apr 2024 05:44 IST

సీఈఓకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: 2018 గ్రూప్‌-1లో ఎంపికైన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాను తెదేపా నేతలు మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ తదితరులు కోరారు. 2018 గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు హైకోర్టు ధ్రువీకరించిందని గుర్తు చేశారు. ఈ అధికారుల వల్ల వైకాపాకు మేలు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర సచివాలయంలో అదనపు ఎన్నికల అధికారికి ఆదివారం వారు ఫిర్యాదు ప్రతిని అందజేశారు. ‘‘శ్రీకాకుళం జిల్లా కోసంగిపురం వద్ద విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న నిఘా అధికారిణిని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు వేలు చూపుతూ బెదిరించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోండి. మాచర్ల నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తూ... తెదేపా వాళ్లను బెదిరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోండి’’ అని ఫిర్యాదులో నేతలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img