icon icon icon
icon icon icon

ఏకరూపం.. ఐక్యతకు ప్రతిరూపం!

ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీర మహిళలు, తెదేపా, భాజపా మహిళా నాయకులు ఇలా జనసేన చిహ్నంతో ఉన్న ఏకరూప చీరలు ధరించి ప్రచారం చేస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:19 IST

ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీర మహిళలు, తెదేపా, భాజపా మహిళా నాయకులు ఇలా జనసేన చిహ్నంతో ఉన్న ఏకరూప చీరలు ధరించి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు బరిలో ఉన్నారు.

 న్యూస్‌టుడే, భీమవరం పట్టణం


భూములు ప్రజలవే.. కానీ పత్రాలే జగన్‌వి
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల భూముల్ని కాజేసే నల్లచట్టం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘ఆస్తి మనది.. కానీ దానిపై సీఎం జగన్‌ బొమ్మతో సర్వే రాళ్లు, పట్టాపై ఆయన బొమ్మ. ఇకపై జనం భూమి జగన్‌ది, ప్రజల ఆస్తి ఆయన సొంతం’ అని ఎక్స్‌ వేదికగా సోమవారం లోకేశ్‌ మండిపడ్డారు. మీ బిడ్డను.. మీ బిడ్డను అని ఊరూరా తిరుగుతూ జగన్‌ అంటున్నప్పుడే అనుమానం వచ్చిందని.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చేసరికి అసలు విషయం అర్థమైందన్నారు.


నేటి పవన్‌ రోడ్‌షో రద్దు

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నిర్వహించాల్సిన రోడ్‌షో రద్దయింది. ఆయన విజయవాడలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో రోడ్‌షో రద్దు చేసినట్లు జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఠాణా ముందే ప్రచార రథం దహనమా?

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఠాణా ముందే భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ప్రచార వాహనాన్ని వైకాపా మూక దహనం చేస్తోంటే పోలీసులు దానికి వత్తాసు పలికారని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర డీజీపీ మారే వరకు కింది స్థాయి పోలీసుల్లో చలనం రాదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో సోమవారం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img