icon icon icon
icon icon icon

జగన్‌ పాలనలో రూ.8 లక్షల కోట్ల అవినీతి: ఎన్డీయే

ఐదేళ్ల సీఎం జగన్‌ విధ్వంసకర పాలనలో రూ.8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎన్డీయే నేతలు ఆరోపించారు.

Published : 30 Apr 2024 05:42 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఐదేళ్ల సీఎం జగన్‌ విధ్వంసకర పాలనలో రూ.8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎన్డీయే నేతలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణతో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణలు సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘మూలధన వ్యయానికి సంబంధించి 8% సగటున ఒక్కో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.16 వేల కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లలోపే వ్యయం చేశారు. 2014-19లో తెలంగాణతో పోలిస్తే రాష్ట్ర వసూళ్లు 15.95% అధికం. అదే.. జగన్‌ పాలనలో 6.4% మాత్రమే. 2014-19లో రాష్ట్ర తలసరి స్థూల ఉత్పత్తి సగటు వృద్ధి 12.79% ఉండగా, వైకాపా ప్రభుత్వ హయాంలో అది 9.45%గా నమోదైంది. ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 5వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 14వ స్థానానికి దిగజార్చారు’ అని దినకర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img