icon icon icon
icon icon icon

మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే లోకేశ్‌ లక్ష్యం: నారా బ్రాహ్మణి

మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లక్ష్యమని ఆయన సతీమణి బ్రాహ్మణి పేర్కొన్నారు.

Published : 01 May 2024 06:33 IST

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లక్ష్యమని ఆయన సతీమణి బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. స్థానిక ఆటోనగర్‌లోని విజయ పచ్చళ్ల పరిశ్రమను సందర్శించి మహిళా కార్మికులతో మమేకమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇలాంటి చిన్నతరహా పరిశ్రమలను లోకేశ్‌ ప్రోత్సహిస్తారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో తయారయ్యే చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు లోకేశ్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. పలు చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘాలతోపాటు కార్మికులతో ఆమె మాట్లాడారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించేందుకు కృషి చేయాలని, ఐదేళ్లుగా చేనేతకు ఎలాంటి చేయూత లేకపోవడంవల్ల తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం షరాఫ్‌ బజారులోని బంగారు ఆభరణాల తయారీ వర్క్‌షాప్‌లు, ఆభరణాల విక్రయ కేంద్రాలను బ్రహ్మణి సందర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్పొరేషన్‌, ప్రత్యేక భవన్‌ ఏర్పాటుకు లోకేశ్‌ సంకల్పించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img