icon icon icon
icon icon icon

అష్టపథం- అధిక జనుల అభివృద్ధికే

రానున్న తరాలకు బంగారు బాటలు వేయడమే తమ ఎన్నికల మ్యానిఫెస్టో ధ్యేయమని లిబరేషన్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు, పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ (రిటైర్డు ఐఏఎస్‌) తెలిపారు.

Published : 02 May 2024 06:09 IST

మ్యానిఫెస్టో ప్రకటించిన లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: రానున్న తరాలకు బంగారు బాటలు వేయడమే తమ ఎన్నికల మ్యానిఫెస్టో ధ్యేయమని లిబరేషన్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు, పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ (రిటైర్డు ఐఏఎస్‌) తెలిపారు. బుధవారం తిరుపతిలో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన ఆవిష్కరించారు. ‘అష్టపథం-అధిక జనుల అభివృద్ధికే’ పేరుతో విడుదల చేసిన ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే వంద శాతం అమలు చేస్తామని ఆయన హామీనిచ్చారు. పేదరిక విముక్తి, విశ్వవిద్య, విశ్వవైద్యం, మహిళా శిశువికాసం, యువతకు భవిత, రైతన్నకు జవసత్వాలు, సుస్థిర అభివృద్ధి-ఆర్థిక పరిపుష్టి, స్వపరిపాలన అనే ఎనిమిది అంశాల ప్రాతిపదికన హామీలను ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img