icon icon icon
icon icon icon

తెదేపా ప్రచార రథం డ్రైవర్‌పై ఎంపీటీసీ సభ్యుడి దాడి

మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు పేట్రేగిపోయారు.

Published : 02 May 2024 06:10 IST

మంత్రి అప్పలరాజు స్వగ్రామంలో పేట్రేగిన వైకాపా నాయకులు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు పేట్రేగిపోయారు. తెదేపా ప్రచార రథం డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు... రామ్మోహన్‌నాయుడు, గౌతు శిరీష రెండు ప్రచార రథాలపై గ్రామానికి వచ్చారు. ఇంటింటి ప్రచారం ముగించుకుని రామ్మోహన్‌నాయుడి ప్రచార రథంపై తిరిగి వెళ్తున్నారు. వారి వెనుక కాస్త దూరంలో గౌతు శిరీష ప్రచార రథం వెళ్తోంది. ఆ సమయంలో గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎంపీటీసీ సభ్యుడు సౌదాల వెంకన్న, వైకాపా కార్యకర్తలు కొందరు... శిరీష ప్రచార రథంపై దాడి చేశారు. రథంపై ఉన్న మాజీ మంత్రి గౌతు శివాజీ చిత్రాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టేందుకు యత్నించారు. ఎందుకిలా చేస్తున్నారని డ్రైవర్‌ ప్రశ్నించగా అతనిపై దాడికి పాల్పడ్డారు. వాహనం తాళాలు తీసుకోవడానికి యత్నించారు. విషయం తెలిసి తెదేపా శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో మద్యం మత్తులో వైకాపా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయని స్థానికులు ఆరోపించారు. మంత్రిపై వ్యతిరేకతతో జనం ప్రచార ర్యాలీకి స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలిరావడంతో ఓర్వలేక ఇలా చేశారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img