icon icon icon
icon icon icon

వైకాపా మ్యానిఫెస్టోలో ‘బ్రాహ్మణ సంక్షేమం’ మాటే లేదు

ఈ ఐదేళ్లలో ఆలయాలు, అర్చకులపై జరిగిన దాడులపై ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసి, విచారణ చేయిస్తామని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్‌ తెలిపారు.

Published : 03 May 2024 05:34 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఐదేళ్లలో ఆలయాలు, అర్చకులపై జరిగిన దాడులపై ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసి, విచారణ చేయిస్తామని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్‌ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని హెచ్చరించారు. వైకాపా మ్యానిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమం అన్న మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఇచ్చిన హామీలనూ జగన్‌ విస్మరించారని దుయ్యబట్టారు. బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. తెదేపా, జనసేన మ్యానిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ పాలనలో ఆలయాలపై దాడులు జరిగాయి. విగ్రహాలు ధ్వంసం చేశారు. విజయవాడలోని బ్రాహ్మణ కార్పొరేషన్‌ భవనాన్ని పాడుపెట్టారు’’ అని బుచ్చి రాంప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img