icon icon icon
icon icon icon

పుంగనూరుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిని నియమించండి

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) రాజంపేట కూటమి అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం లేఖ రాశారు.

Published : 03 May 2024 05:35 IST

ఈసీకి రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ

ఈనాడు, చిత్తూరు: రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) రాజంపేట కూటమి అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు జరిగే వరకు అదనపు పారా మిలటరీ బలగాలను మోహరించాలని కోరారు. ఎన్నికల్లో విధ్వంసానికి పాల్పడే వ్యక్తులపై షాడో పార్టీలతో నిఘా ఏర్పాటు చేయాలని, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించాలని అభ్యర్థించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పికెట్‌ పెట్టాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులను బదిలీ చేసి ఆ స్థానంలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారిని నియమించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే అవకాశమున్నందున చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు లేఖలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img