icon icon icon
icon icon icon

అమరావతే రాజధాని అని చెప్పినా.. జగన్‌ బుద్ధి మారలేదు

అమరావతే రాజధాని అని న్యాయస్థానాలు చెప్పినా.. జగన్‌ బుద్ధి మారలేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు.

Published : 05 May 2024 06:34 IST

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: అమరావతే రాజధాని అని న్యాయస్థానాలు చెప్పినా.. జగన్‌ బుద్ధి మారలేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అంటూ ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం దీనికి నిదర్శనమన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ.. రాష్ట్రాన్ని విభజించేందుకూ వెనుకాడటం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాని గద్దె దించకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. మహిళా ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ మాట్లాడుతూ.. అమరావతిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ  ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజధాని పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల చిత్రాలను ప్రదర్శించారు.  నాయకులు నాగేంద్ర, శ్రీనివాసరావు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img