icon icon icon
icon icon icon

ఎన్డీయేకు నవతరం పార్టీ మద్దతు

రాష్ట్రంలో జగన్‌ రాక్షసపాలనను అంతం చేయడానికి ఎన్డీయేకు భేషరతుగా మద్దతు తెలుపుతున్నట్టు నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

Published : 08 May 2024 06:24 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో జగన్‌ రాక్షసపాలనను అంతం చేయడానికి ఎన్డీయేకు భేషరతుగా మద్దతు తెలుపుతున్నట్టు నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. తమ పార్టీ పోటీ చేస్తున్న ఆరు అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీయేకి ఓటెయ్యాలని ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని వర్గం లేదని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో కలిసి రావు సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘మా పార్టీ అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పోటీ నుంచి విరమించుకుంటున్నాం. రాష్ట్రానికి చంద్రబాబు పాలన, కేంద్రం సహకారం, పవన్‌కల్యాణ్‌ లాంటి ప్రజాసేవకుడు అవసరం’’ అని తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నవతరం పార్టీ మద్దతును స్వాగతిస్తున్నట్లు వర్ల రామయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img