icon icon icon
icon icon icon

YS Sharmila: ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా: వైఎస్‌ షర్మిల

ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Updated : 09 May 2024 12:42 IST

పులివెందుల: ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారు. అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నాం. కాల్‌ రికార్డ్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఆధారాలన్నీ ఉన్నాయి. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారు. జగన్‌కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా? అని ప్రపంచమంతా చూస్తోంది. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నా’’ అని షర్మిల అన్నారు.

రేపోమాపో అవినాష్‌రెడ్డి జైలుకు: సునీత

తన తండ్రిని దారుణంగా హతమార్చారని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చన్నారు. ప్రజా తీర్పు పెద్దదని.. దానికోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ‘‘వైఎస్‌ అవినాష్‌రెడ్డి రేపో మాపో జైలుకు పోతారు. జైలుకు పోయేవారు కాదు.. జనాల్లో ఉండేవాళ్లు రావాలి. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించండి’’ అని సునీత కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img