icon icon icon
icon icon icon

సీమలో వీరు 4,312 అడుగుల ఎత్తు నుంచి ఓటెయ్యనున్నారు!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనుండగా.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, రాయలసీమ ఊటీగా పేరొందిన హార్సిలీహిల్స్‌లోని ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్‌ కేంద్రానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 08 May 2024 06:54 IST

రాయలసీమలో అతి చిన్న పోలింగ్‌ కేంద్రంగా హార్సిలీహిల్స్‌

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనుండగా.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, రాయలసీమ ఊటీగా పేరొందిన హార్సిలీహిల్స్‌లోని ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్‌ కేంద్రానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ కేంద్రంలో మొత్తం 90 మంది ఓటర్లు ఉన్నారు. రాయలసీమలో తక్కువ సంఖ్యలో ఓటర్లున్న అతి చిన్న పోలింగ్‌ కేంద్రం ఇది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఇది ఉండగా.. సీమలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తుపై నుంచి స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గతంలో కోటావూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ హిల్స్‌ స్టేషన్‌ను 20 ఏళ్ల కిందట హర్సిలీహిల్స్‌ టౌన్‌షిప్‌ పరిధిలోకి చేర్చారు. అప్పటి నుంచి పంచాయతీ, మండల పరిషత్తుల పాలనా వ్యవహారాలతో దీనికి సంబంధం లేకుండా పోయింది. కొండపై ఉన్న ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోగా.. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అయిదేళ్లకు ఓసారి మాత్రమే ఆ హక్కును వీరు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటోంది. కొండపై ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ హిల్‌ స్టేషన్‌ కావడంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడ 94 ఓట్లు ఉండగా ఈసారి వివిధ కారణాలతో నలుగురిని జాబితాలో నుంచి తీసేశారు. చిన్న కేంద్రమే అయినా.. బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img