icon icon icon
icon icon icon

వివేకాది గుండెపోటని ప్రసారం చేసింది భారతీనే

‘మాజీ మంత్రి వివేకా హత్య కేసును సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేసింది.. ఆ ఛానల్‌ను నడిపించే సీఎం జగన్‌ భార్య భారతి’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 08 May 2024 06:46 IST

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన విమర్శలు

ఈనాడు, కడప: ‘మాజీ మంత్రి వివేకా హత్య కేసును సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేసింది.. ఆ ఛానల్‌ను నడిపించే సీఎం జగన్‌ భార్య భారతి’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ప్రసారం చేయడానికి గల కారణాన్ని ఇప్పటి వరకూ చెప్పలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పలు మండలాల్లో షర్మిల మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి చిన్న పిల్లాడు కాదని, అమాయకుడు అంతకంటే కాదని ఆమె మండిపడ్డారు. హత్య తర్వాత సాక్ష్యాధారాలను తుడిపేస్తుంటే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ‘హత్య కోసం రూ.40 కోట్ల ఒప్పందం జరగ్గా, రూ.5 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారనే ఆధారాలున్నాయి. ఆనాడు అన్న కోసం 3,200 కి.మీ పాదయాత్ర చేశా.. ఇవాళ వివేకా విషయంలో అన్యాయం జరిగింది కాబట్టే ఎదురు తిరిగాను. నేను చేసింది తప్పా? మీ ఎంపీని మీ జిల్లాలోనే కలవాలంటే నన్ను గెలిపించండి.. జైల్లో కలవాలంటే అవినాష్‌ను గెలిపించండి. దీనిపై తేల్చుకోవాల్సింది ప్రజలే. పంచడానికి నా దగ్గర డబ్బుల్లేవు. నిజం, న్యాయం, ఈ గడ్డ మీద నమ్మకం ఉన్నాయి. న్యాయం కోసం.. ధర్మం కోసం కొంగు చాచి అడుగుతున్నా’ అని షర్మిల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img