icon icon icon
icon icon icon

YS Sharmila: ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Updated : 27 Apr 2024 15:48 IST

అమరావతి: సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ మేరకు జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు.

‘‘మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ తరఫున ఇదే మా డిమాండ్‌’’ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img