icon icon icon
icon icon icon

Nara Bhuvaneswari: వైకాపా నేతలకు భూములు కట్టబెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌: నారా భువనేశ్వరి

ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 14:08 IST

కుప్పం: ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు రామకుప్పం మండలంలో ఆమె పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందని విమర్శించారు. దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాధితులుగా మారారని ఆరోపించారు. 

‘‘వైకాపా పాలనలో గత ఐదేళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైంది. ఇసుక, మద్యం, మైనింగ్, భూకబ్జాలతో ఆ పార్టీ నేతలు దోచుకున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కొత్తగా పెట్టుబడులు ఏమీ రాలేదు. అన్ని వర్గాలకు మేలు చేసేలా, సంక్షేమాన్ని అందించేలా తెదేపా అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తాం. జగన్‌కు భూదాహం పెరిగింది. అందుకే ఆ పార్టీ నేతలందరికీ రాష్ట్ర ప్రజల భూములను కట్టబెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు’’ అని భువనేశ్వరి విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img