Updated : 31/12/2020 10:27 IST

#2020:ఆనంద్‌ మహీంద్రా బెస్ట్‌ ట్వీట్స్‌ ఇవే..

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యాపారం అంటే లాభనష్టాల లెక్కలు.. విస్తరణ ప్రణాళికలు.. ఆదాయం పెంచుకునే వ్యూహాలు. సాధారణంగా ఓ వ్యాపారవేత్త అంటే గుర్తొచ్చేవి ఇవే. కానీ, ఆయన అందరిలా కాదు. సోషల్‌మీడియాలో వచ్చే జోకులకు తనదైన చమత్కారం జోడించి నవ్విస్తారు.. ఆసక్తికర ట్వీట్లతో స్ఫూర్తి నింపుతారు.. నిత్య జీవితంలో ఎలా వ్యవహరించాలో జీవిత పాఠాలు నేర్పుతారు. ఈ ఉపోద్ఘాతమంతా ఆనంద్‌ మహీంద్రా గురించేనని ఈ పాటికే అర్థమై ఉంటుంది. నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయనకు 8.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన ట్వీట్లకున్న ఫాలోయింగ్‌ను అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఏడాది ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్లను ఓ సారి పరిశీలిద్దాం.

కంటతడి పెట్టిస్తారు.. అంతలోనే నవ్విస్తారు


ఓ పెద్దాయన రోజూ బరువులు ఎత్తుతూ తంటాలు పడుతుంటాడు. కానీ, ఆయనెందుకు అలా చేశాడనేది క్రిస్మస్‌ రోజున తెలుస్తుంది. మనవరాలిని ఎత్తుకుని క్రిస్మస్‌ ట్రీపై స్టార్‌ను ఆమె చేత పెట్టించేందుకు ఆయన అలా చేశాడనే వీడియో సారాంశం. ఈ వీడియో తనకు ఏడుపు తెప్పించిందని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ చేసిన ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. అది చూసిన నెటిజన్లు కూడా తాము సైతం కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఒంటరి చీమ 29 ఏళ్లు బతుకుతుందంటూ ఎవరో చేసి ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు.. ‘మరి పెళ్లైన చీమ పరిస్థితి ఏంటి భయ్యా’ అంటూ మరొకరు చేసిన కామెంట్‌ చూసి తాను పగలబడి నవ్వానంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది.

మహీంద్రా వారి జీవిత సత్యాలు.. స్ఫూర్తి పాఠాలు

కరోనా వేళ ఆనంద్‌ మహీంద్రా ఎన్నో జీవిత సత్యాలను తన ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఆనందం ఎక్కడుంటుంది? అనే ప్రశ్నకు సులభంగా సమాధానమిచ్చారు ఆనంద్‌ మహీంద్రా. అది ఎవరో ఇచ్చేది కాదు.. సొంతంగా పొందాలని ఓ చిన్న కార్టూన్‌ ద్వారా చెప్పారు. కరోనా కారణంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న అరటి రైతులకు.. తమ క్యాంటీన్లలో అరటి ఆకులు ఉపయోగించి అండగా నిలిచానని చెబుతూనే.. చిన్న ఉపాయంతో ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్పించారాయన. కొవిడ్‌ కారణంగా మన జీవితం ఎలా మారిపోయిందో ఒక చిన్న మీమ్‌ ద్వారా చెప్పారు. ప్రతిదీ కంప్యూటర్‌ మయం అవ్వడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్‌ ఇలా ఉండకూడదంటూ ఆకాంక్షించారు. ఇవే కాదు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ దివ్యాంగుడు జెండాగా ఎలా మారాడో చూపిన వీడియో.. చిన్న పిల్లాడి పరుగు గురించి.. గుక్క తిప్పుకోకుండా ఓ బాలుడి జాతీయ గీతం ఆలపించిన వీడియోలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఆయన చేసిన ఆసక్తికర ట్వీట్లను తిలకించేయండి..

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్