‘బ్రూ’లకు త్రిపురలో నివాసం

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా త్రిపురలో తలదాచుకుంటున్న ‘బ్రూ’ (రియాంగ్‌) జాతీయులకు ఉపశమనం లభించింది. 23 ఏళ్ల క్రితం మిజోరంలో ఘర్షణలతో  పారిపోయి త్రిపురలో నివాసముంటున్న దాదాపు 30 వేలమంది ‘బ్రూ’ జాతీయులకు అక్కడే శాశ్వత నివాసం కల్పించాలని 

Updated : 19 Jan 2020 14:56 IST

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా త్రిపురలో తలదాచుకుంటున్న ‘బ్రూ’ (రియాంగ్‌) జాతీయులకు ఉపశమనం లభించింది. 23 ఏళ్ల క్రితం మిజోరంలో ఘర్షణలతో  పారిపోయి త్రిపురలో నివాసముంటున్న దాదాపు 30 వేలమంది ‘బ్రూ’ జాతీయులకు అక్కడే శాశ్వత నివాసం కల్పించాలని కేంద్రం, మిజోరం, త్రిపుర, బ్రూ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.  దీంతో  వీరు త్రిపురలో అన్నిహక్కులు పొందనున్నారు.

మిజోరం నుంచి ఎందుకు వచ్చారు?

1997లో మిజోరంలో ఏర్పడిన ఘర్షణలతో 30 వేలమంది వరకు బ్రూ జాతీయులు త్రిపురకు పారిపోయారు. ఇటు మిజోరం రప్పించక, అటు త్రిపుర వీరికి స్థిరనివాసం కల్పించకపోవడంతో నానా కష్టాలకు గురయ్యారు. చివరకు కేంద్రం చొరవతో వీరి సమస్యకు పరిష్కారం లభించింది.

అన్నీ సౌకర్యాలు లభిస్తాయి..

కేంద్ర ప్రభుత్వం వీరి అభివృద్ధికి రూ. 600 కోట్లను కేటాయించింది. ప్రతి కుటుంబానికి నివాసిత స్థలంతో పాటు రెండేళ్లపాటు ఉచిత రేషన్‌ లభిస్తుంది. ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు.  ప్రతి ఒక్కరికి నెలకు రూ. 5000 చొప్పున రెండేళ్ళ పాటు సాయం అందిస్తారు. 

త్రిపురలో ఆందోళన..
‘బ్రూ’ జాతీయులకు త్రిపురలో శాశ్వత నివాసం కల్పించడంపై  అక్కడ ఆదీవాసేతర సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. బ్రూ జాతీయులు నివాసం ఉంటున్న కంచన్‌పూర్‌ నుంచి వారిని తిరిగి మిజోరంకు పంపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని