Chandrababu: కనిగిరిలో ‘అన్న క్యాంటీన్‌’ పరిశీలించిన చంద్రబాబు

ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated : 06 Jan 2024 13:32 IST

కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన ఏడాదిగా ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి, స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. అలాగే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. వైకాపాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని