AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు

‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ఏపీ ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.

Published : 18 Mar 2024 17:29 IST

అమరావతి: ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యముందని, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈవోకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.

తెదేపా నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. భద్రత గురించి ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశాం. కానీ, ఆదివారం జరిగిన సభలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేదు. సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ వైకాపా కార్యకర్తగా పనిచేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్‌కు అంతరాయం కలగడమేంటి?నలుగురు పోలీసు అధికారులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఆ నలుగురు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఈసీని కోరాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని