Rangam - Mahakali Temple: మీ వెంటే ఉంటా భయపడొద్దు.. రంగంలో స్వర్ణలత

బోనాల వేడుకల్లో భాగంగా ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం (Rangam - Mahakali Temple) కార్యక్రమం నిర్వహించారు

Updated : 10 Jul 2023 14:37 IST

హైదరాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయన్నారు.

‘‘అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి..ప్రజలు భయపడవద్దు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదే. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాధ్యత నాదే. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. నా దగ్గరకు వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాది’’ అని స్వర్ణలత అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

అంబారీపై అమ్మవారి ఊరేగింపు

మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని