Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Apr 2024 09:04 IST

1. మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా

‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రిపదవులు, ఎక్కువ దాడులు చేస్తే.. పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి రౌడీయిజం కావాలా? పూర్తి కథనం 

2. అయ్యో రామా.. ప్రచారంలో అలసత్వమా?

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అన్ని రకాల సెక్టార్లలో 35 వేల మంది కూర్చొనే వీలుండగా.. ఆయా టికెట్ల విక్రయం మందకొడిగా సాగుతోంది. ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తి కథనం 

3. అబద్ధాల అబ్బాయి.. మళ్లీ మోసపోలేమోయి..

అబద్ధాలను అతి సునాయాసంగా పదే పదే చెబుతూ.. అందుకు తగ్గట్టుగా నటిస్తూ ఇతరులను నమ్మించడంలో ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డిది అందె వేసిన చెయ్యి. మాట తప్పను.. మడమ తిప్పనంటూ పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాల డప్పు కొట్టారు. అధికారంలోకి రావడమే తరువాయి సమస్యలు పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పారు. గద్దెనెక్కాక అవేమీ చేయకుండా మిన్నకుండిపోయారు. పూర్తి కథనం 

4. ఫోన్‌ ట్యాపింగ్‌ మొదటి బాధితుడిని నేనే: ఈటల

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్‌, వంట మనుషులు సహా అందరి ఫోన్లు ట్యాప్‌ చేశారని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో ఆదివారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు.  పూర్తి కథనం 

5. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. నిరుద్యోగ సమస్య పెరిగింది.. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. వీటిపై ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు.  పూర్తి కథనం 

6. ఎన్‌హెచ్‌ఎం నిధులకు గండి

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులకు గండి పడింది. మూడు, నాలుగు త్రైమాసికాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన కేంద్రం వాటా నిధులను విడుదల చేయలేదు. మార్చి 31 వరకు ఎదురుచూసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు మురిగిపోయినట్లు నిర్ణయానికి వచ్చింది. పూర్తి కథనం 

7. తెదేపాను వీడేది లేదు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే... తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పూర్తి కథనం 

8. మోదీ త్వరలో లాంగ్ లీవ్‌పై వెళ్తారు.. ఇది ప్రజల గ్యారంటీ: జైరాం రమేశ్‌

సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ (Congress) ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌(Jairam Ramesh) మండిపడ్డారు. జూన్‌ 4 తర్వాత మోదీ ఇక లాంగ్‌ లీవ్‌ తీసుకోవాల్సి ఉంటుందని, ఇది భారత ప్రజల గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గడిచిన పదేళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో నిరాశలో ఉన్న మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. పూర్తి కథనం 

9. ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు!

ఆర్టీసీలో ఓవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది.  పూర్తి కథనం 

10. మహర్దశ తెస్తానని.. మగ్గాన్నే విరిచేశారు!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వస్త్రాలను నేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన చేనేత రంగాన్ని సీఎం జగన్‌ ఛిద్రం  చేశారు. మగ్గానికి మహర్దశ తెస్తామని 2019 ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరిచారు. మగ్గంపై పడుగు, పేకలు ఆడక నేతన్నల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా కనికరించలేదు. చివరికి కుటుంబ పోషణ కష్టమై వారు కూలీ పనుల బాట పట్టినా మిన్నకున్నారు. పూర్తి కథనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని